తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి.. 28 మందికి గాయాలు - బాపట్లజిల్లా అద్దంకి వద్ద రోడ్డు ప్రమాదం

RTC bus accident in Bapatla district: ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లా అద్దంకి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రహదారిపై ఆగి ఉన్న లారీని టీఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. 28 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. చికిత్స కోసం బాధితుల్ని అంబులెన్స్‌లో తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

RTC bus accident in Bapatla
RTC bus accident in Bapatla

By

Published : Dec 10, 2022, 8:58 PM IST

RTC bus accident in AP: హైదరాబాద్ నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీ బస్సు.. ఏపీలోని బాపట్ల జిల్లా అద్దంకి వద్ద రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో మెుత్తం 28 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. నామ్ రహదారిపై ఆగి ఉన్న లారీని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిందని పేర్కొన్నారు. మృతుడు కావలికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

క్షతగాత్రులను అద్దంకి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని ఒంగోలు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. స్వల్పగాయాలైన వారు అద్దంకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details