Massive theft in Bapatla: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. చుండూరు మండలం మోదుకూరు గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఓ ఇంటిలోకి చొరబడి సుమారు కోటి రూపాయలు విలువ చేసే బంగారం, వెండి వస్తువులు అపహరించారు. గ్రామ సచివాలయం సమీపంలో ఉన్న ఆ ఇంటిలో వెంకటరమణా రెడ్డి(62) హర్షవాణి(55) దంపతులు నివాసం ఉంటున్నారు. అర్ధరాత్రి సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు.
బాపట్ల జిల్లాలో భారీ చోరీ.. ఓ ఇంట్లో కిలోకు పైగా బంగారం అపహరణ
Massive theft in Bapatla: రోజు మాదిరిగానే ఆ దంపతులు నిద్రపోయారు. తెల్లారి లేచి చూసేసరికి షాక్‌కు గురయ్యారు. ఇంట్లోని ఓ గదిలో సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని కిలోకు పైగా బంగారం, వెండి, రూ.12 వేలు మాయం కావడంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Massive theft in Bapatla
ఓ గదిలోని బీరువా పగులకొట్టి.. 1కేజీ 400 గ్రాముల బంగారం, కేజీ వెండి ఆభరణాలు, 12వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. తెల్లవారుజామున గమనించిన ఇంటి యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి.. పోలీసులు కేసు నమోదు చేశారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. రాత్రి సమయంలో ఎవరైనా అనుమానంగా సంచరించారా అని సీసీ కెమెరా దృశ్యాల ద్వారా పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇవీ చదవండి: