తెలంగాణ

telangana

ETV Bharat / crime

Boy suspected death: అనుమానాస్పదస్థితిలో బాలుడు మృతి.. బంధువుల ఆందోళన - బాలుడు మృతి

ఆడుకుంటానన్న మాటలే ఆ బాలుడికి చివరి మాటలయ్యాయి. పాఠశాల నుంచి ఇంటికి రాగానే పరుగెత్తుకుంటూ వచ్చి ఆడుకుంటానని చెప్పివెళ్లిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద శవమై తేలాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం తండాలో చోటుచేసుకుంది. అయితే బాలుడి మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Boy suspected death
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం తండాలో బాలుడు మృతి

By

Published : Oct 29, 2021, 4:50 AM IST

ఆడుకునేందుకని వెళ్లిన బాలుడు శవమై తేలాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం తండాలో జరిగింది. సోమారం తండాకు చెందిన కట్రోత్ విగ్నేష్(8) గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద శవమై కనిపించాడు. అయితే బాలుని మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తండాకు చెందిన కట్రోత్ విగ్నేష్ రోజు మాదిరిగానే పాఠశాల నుంచి తిరిగి వచ్చాక ఆడుకునేందుకని బయటకు వెళ్లాడు. సాయంత్రం 6 గంటలు దాటిన విగ్నేష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల బాలుని కోసం వెతికారు. చివరకు గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద విగ్నేష్ శవమై కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే బాలుని మృతిపై అనుమానం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న తాడ్వాయి ఎస్సై కృష్ణమూర్తి, సదాశివనగర్ సీఐ రామన్ డాగ్ స్వాడ్​ను రప్పించి విచారణ చేపట్టారు .

ABOUT THE AUTHOR

...view details