firing in old city: తుపాకీ కాల్చాలన్న సరదాతో ఓ యువకుడు సోదరుడి ద్వారా ఎయిర్‌పిస్టల్ కొనుగోలు చేసి ఇంట్లో సాధన చేస్తుండగా గురితప్పి ఓ బాలుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. పాతబస్తీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శుక్రవారం మొఘల్‌పురా సీఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్‌షాహీకు చెందిన మహ్మద్ అబ్దుల్ అఫ్సర్(30) వాటర్‌ప్లాంట్, పాన్ దుకాణం నిర్వహిస్తున్నాడు.
firing in old city : బల్లికి గురి పెట్టి.. బాలుడిని కాల్చాడు
firing in old city: హైదరాబాద్ పాతబస్తీలో కాల్పుల కలకలం రేగింది. ఓ యువకుడు ఇంట్లో గోడపై ఉన్న బల్లులను కాల్చుతుండగా.. ప్రమాదవశాత్తు బుల్లెట్ ముక్క తగిలి పక్కింటి వరండాలో ఆడుకుంటున్న ఓ బాలుడు గాయపడ్డాడు. ఈ నెల 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ నెల 1న మధ్యాహ్నం ఎయిర్ పిస్టల్(0.177)తో గోడ మీద బల్లులను కాల్చసాగాడు. ప్రమాదవశాత్తు ఓ బుల్లెట్ గోడకు తగిలి చిన్న ముక్క(పెల్లెట్) వరండాలో ఆడుకుంటున్న పక్కింట్లోని బాలుడు(9) వీపునకు తగిలింది. గాయపడిన బాలుడికి స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స జరిపించి, బంజారాహిల్స్‌లోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. 3న బహదూర్‌పురాలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను కోలుకుని శుక్రవారం ఇంటికెళ్లాడు.
బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అఫ్సర్‌పై కేసు నమోదు చేశారు. అఫ్సర్ ఎయిర్ పిస్టల్‌తో వస్తువులను కాల్చటం సాధారణంగా మారిందని.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చికిత్స చేసిన ఆసుపత్రులు సైతం పోలీసులకు సమాచారం ఇవ్వకపోవటం గమనార్హం.