ద్విచక్రవాహనంపై నుంచి కింద పడ్డ బాలుడిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో చోటుచేసుకుంది. నరేశ్ అనే వ్యక్తితో అజ్మీర రాజేశ్(14) టేకులపల్లి మండలానికి బైక్‌పై వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఒకరు మృతి - telangana news
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనటం వల్ల 14 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

సులానగర్ నుంచి వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొనడంతో బాలుడు రాజేశ్ ఎగిరి రోడ్డు మీద పడిపోయాడు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న ట్రాక్టర్ బాలుడి మీద నుంచి పోవడంతో తీవ్రగాయాలతో పోరాడి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మరణంతో రాజీవ్ నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడి తండ్రి సంవత్సరం క్రితం అనారోగ్యంతో చనిపోగా బాలుడి తల్లి కూలీ పనులు చేసుకుంటూ కుమారున్ని పోషిస్తుంది. ఇంట్లో పెద్దవాడిగా ఉన్న రాజేశ్ మరణంతో తల్లి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి:బాలుడిని కొట్టిన పెదనాన్నపై ఫిర్యాదు