తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రమాదవశాత్తు మెడకు చీర చుట్టుకొని బాలుడు మృతి - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. చీరతో కట్టిన ఊయలలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు అది మెడకు చుట్టుకుని ఓ ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

one boy dead in Bhadradri Kothagudem district
చీర మెడకు చుట్టుకొని బాలుడు మృతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు

By

Published : Apr 20, 2021, 7:58 PM IST

ప్రమాదవశాత్తు ఊయల చీర మెడకు చుట్టుకొని ఆరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చోటుచేసుకుంది. స్థానిక యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్​గా పనిచేస్తున్న రవికుమార్​కు ఇద్దరు కుమారులు. ఆయన పెద్ద కుమారుడు సాహంత్... ఆడుకునేందుకు ఇంట్లో చిరతో కట్టిన ఊయల ఎక్కాడు. ఆ సమయంలో బాలుడి తల్లి నందిని ఇంటి బయట కూర్చుని చిన్న కుమారునికి అన్నం తినిపిస్తోంది.

కాసేపటి తరువాత ఆమె ఇంట్లోకి వెళ్లి చూసే వారికి సాహంత్​ మెడకు చీర చుట్టుకుని ఉండడంతో పెద్దఎత్తున కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి ఊయల చీరను కత్తరించి బాలుడిని బయటకు తీశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాహంత్​ను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

ABOUT THE AUTHOR

...view details