103 Pending Challans in One Bike: ఒకటి, రెండు కాదు.. ఏకంగా 103 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ ద్విచక్ర వాహనదారుడు బుధవారం సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఎస్సై ప్రసాద్ కథనం ప్రకారం.. ట్రాఫిక్ పోలీసులు ఉదయం 11 గంటల ప్రాంతంలో అఫ్జల్‌గంజ్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ద్విచక్రవాహనంపై అటుగా వచ్చిన పురానాపూల్ ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి అరవింద్‌ను పోలీసులు ఆపారు. పరిశీలించగా.. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో అతడి బైక్‌పై 103 ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రూ.32,200 చలానా బకాయి ఉన్నట్లు తేలింది. దీంతో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.
ఒకే బండిపై 103 చలానాలు.. బకాయి ఎంతంటే..? - హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
103 Pending Challans in One Bike: ఏదైనా అత్యవసరమైన పని ఉంటేనో… తొందరపాటులోనో సిగ్నల్ జంప్ చేయటం… మరిచిపోయి హెల్మెట్ పెట్టుకోకపోవటం వంటి ఉల్లంఘనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అలా అనుకోకుండా ఒకటి రెండు సార్లు జరిగి ఉండవచ్చు. కానీ.. ఓ ప్రబుద్ధుని బండిపై ఏకంగా 103 చలానాలు ఉన్నాయి.

ఒకే బండిపై 103 చలానాలు