అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా... శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బంగారం రవాణా ఆగడం లేదు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి... దాదాపు కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీన్స్ ప్యాంట్ నడుము భాగంలో గోల్డ్ పేస్ట్, అత్యవసర టార్చ్‌లో అమర్చి బంగారు బిస్కెట్లను దాచి తెచ్చినట్లు కస్టమ్స్ డీసీ శివకృష్ణ తెలిపారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కిలోన్నర బంగారం స్వాధీనం - gold seized in shamshabad
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు కిలోన్నర బంగారం పట్టుబడింది. దాదారు 69.6 లక్షల విలువ చేసే పుత్తడిని నిందితులు... జీన్స్ ప్యాంట్ నడుము భాగంలో గోల్డ్ పేస్ట్, అత్యవసర టార్చ్‌లో దాచి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.
one and half gold seized in shamshabad airport
పట్టుపడిన బంగారం విలువ 69.6 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇద్దరు ప్రయాణికులపై పుత్తడి అక్రమ రవాణా కేసు నమోదు చేసినట్లు వివరించారు. బంగారాన్ని అక్రమంగా ఎవరు రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు