తెలంగాణ

telangana

ETV Bharat / crime

telugu akademi fd scam: తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో మరొకరు అరెస్టు - తెలుగు అకాడమీ ఫిక్స్​డ్​ డిపాజిట్ల స్కాం వార్తలు

telugu akademi fd scam
telugu akademi fd scam

By

Published : Oct 14, 2021, 6:10 PM IST

Updated : Oct 14, 2021, 7:32 PM IST

18:08 October 14

తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో మరొకరు అరెస్టు

తెలుగు అకాడమీ కేసులో (telugu akademi fd scam) సీసీఎస్ పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన సాంబశివరావును అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్​కు తీసుకొచ్చి రిమాండ్​కు తరలించారు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధనకు సమీప బంధువైన సాంబశివరావు.. డిపాజిట్లు గోల్​మాల్​ చేసిన ముఠాకు సహకరించాడు. వెంకటరమణ ద్వారా సాయికుమార్​ను పరిచయం చేసుకున్న సాంబశివరావు.. బ్యాంకుల్లోని ప్రభుత్వ శాఖల డిపాజిట్లను కొల్లగొట్టేందుకు ప్రణాళిక రచించారు. సాయికుమార్​కు కెనరా బ్యాంకు మేనేజర్ సాధనను పరిచయం చేసిన సాంబశివరావు... ఆ తర్వాత కొల్లగొట్టిన డబ్బుల్లో 50 లక్షల రూపాయలను వాటాగా తీసుకున్నట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. 

ప్రస్తుతం కెనరా బ్యాంకు మేనేజర్ సాధనను సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 3 రోజులు ప్రశ్నించినా.. సరైన సమాధానాలు చెప్పలేదు. రేపటితో కస్టడీ ముగియనుండటంతో మరో నాలుగు రోజులు కస్టడీ పొడిగించాలని సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. వాటాగా తీసుకున్న డబ్బులో దాదాపు 80 లక్షల రూపాయలను కాల్చేసినట్లు మేనేజర్ సాధన.. సీసీఎస్ పోలీసులకు పొంతన లేని సమాధానం చెప్పింది. దీంతో సీసీఎస్ పోలీసులు అవసరమైతే నోట్లు కాల్చిన స్థలానికి క్లూస్ టీంను తీసుకొని ఆధారాలు సేకరించాలనే యోచనలో ఉన్నారు. 

ఇదీచూడండి:Telugu Akademi Scam Updates : రూ.90 లక్షలతో ఓ ఫ్లాట్‌ కొన్నా... రూ.80 లక్షల నోట్ల కట్టలు కాల్చేశా...

Last Updated : Oct 14, 2021, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details