సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. వీరి ఉచ్చులో చిక్కుకుని, డబ్బులు పోగొట్టుకుంటున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ ఆర్మీ జవానుకు కేటుగాళ్లు గాళం వేశారు. తక్కువ ధరకే ద్విచక్రవాహనం విక్రయిస్తామంటూ ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చారు.
ఆర్మీ జవానుకు సైబర్ కేటుగాళ్లు కుచ్చుటోపీ
సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కుచ్చుటోపీ పెడుతున్నారు. తాజాగా ఓఎల్ఎక్స్ పేరుతో ఓ ఆర్మీ జవాను నుంచి రూ.3.5 లక్షలు కాజేశారు.
ఆర్మీ జవానుకు సైబర్ కేటుగాళ్లు కుచ్చుటోపీ
దానిని కొనేందుకు సంప్రదించిన ఆర్మీ జవాను నుంచి వివిధ ఛార్జీల పేరుతో రూ.3.5 లక్షలు ఆన్లైన్ ద్వారా కాజేశారు. మోసపోయిన విషయం తెలుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఫోర్జరీ దస్త్రాలతో బ్యాంకులను మోసం చేసిన భార్యాభర్తలు