తెలంగాణ

telangana

ETV Bharat / crime

కరోనా పరీక్ష కోసం వెళ్లిన వృద్ధుడు మృతి - khammam district news

కరోనా నిర్ధరణ పరీక్షకు వెళ్లి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ వద్ద చోటుచేసుకుంది. అతని వెంట ఉన్న భార్య, బంధువులు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.

khammam district news, corona cases in khammam district, corona news
ఖమ్మం జిల్లా వార్తలు, ఖమ్మంలో కరోనా వ్యాప్తి, ఖమ్మంలో వృద్ధుడు మృతి

By

Published : May 2, 2021, 11:59 AM IST

మహబూబాబాద్​కు చెందిన ఆనందాచారి అనే వృద్ధుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఖమ్మంలోని ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం రాగా.. కరోనా పరీక్ష నివేదిక సమర్పించాలని వైద్యులు సూచించారు.

కొవిడ్ పరీక్ష కోసం పాత బస్టాండ్ వద్ద ఉన్న పరీక్షా కేంద్రానికి వెళ్లిన ఆనందాచారి తన వంతు కోసం వేచిచూస్తూ అక్కడే మృతి చెందాడు. అతని వెంట ఉన్న భార్య, బంధువులు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details