సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరుకోలు గ్రామంలో కుపురభీ అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. ఆమెకు కుమారుడు ఉండగా అతను కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.
ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలు మృతి - తెలంగాణ వార్తలు
ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరుకోలులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
![ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలు మృతి ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:31:21:1620990081-11758254-bavi.jpg)
ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలు మృతి
కుపురభీ గ్రామంలో ఒంటరిగా జీవిస్తోంది. మూడు రోజుల క్రితం వరుకోలు గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావి వద్దకు చింతకాయలు వేరుకోవడానికి వెళ్లింది. చింతచెట్టు ప్రక్కనే గల వ్యవయసాయ బావిలో ప్రమాదవశాత్తు కాలుజారి పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:దృఢ సంకల్పంతో కరోనాను జయించిన కుటుంబం