ఏపీలోని విజయవాడ శివారులోని కుందావారి కండ్రికలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. దోపిడీ చేయడమే కాకుండా.. ఇంటి ముందు కూర్చొని ఉన్న వృద్దురాలి సుబ్బమ్మపై కిరాతకంగా దాడి చేశారు. అనంతరం నగలు ఎత్తుకెళ్లారు.
murder: వృద్ధురాలు దారుణ హత్య... నగల కోసం కిరాతకం - విజయవాడలో చోరీ కేసు
ఏపీలోని కృష్ణా జిల్లాలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఇంటి ముందు కూర్చొని ఉన్న ఆమెను కిరాతకంగా దాడిచేసి.. నగలు కాజేశారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది.
old women murder
తీవ్రగాయాల పాలైన సుబ్బమ్మను ఓ ప్రైవేటు ఆస్పత్రికి స్థానికులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుబ్బమ్మ మృతి చెందింది. సమాచారం అందుకున్న సీసీఎస్, నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీచూడండి:Tollywood Drugs Case: మత్తుమందు లావాదేవీల గుట్టు రట్టే లక్ష్యం