కామారెడ్డి జిల్లాలో దారుణ హత్య జరిగింది. రామారెడ్డి మండలంలోని జగదాంబ తండాలో నివాసం ఉంటున్న భూక్య కపూరి అనే వృద్ధురాలు రాత్రి ఆరుబయట నిద్రిస్తుండగా.. గొంతు కోసి దుండగులు హత్య చేశారు. కుటుంబసభ్యులు పెళ్లికి వేరే గ్రామానికి వెళ్లడం వల్ల కపూరి ఒంటరిగా ఉంది.
జగదాంబ తండాలో వృద్ధురాలి హత్య - kamareddy district crime news
ఆరుబయట నిద్రిస్తున్న వృద్ధురాలిని హత్య చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం జగదాంబతండాలో చోటుచేసుకుంది. గ్రామస్థుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధురాలి హత్య, హత్య
గ్రామస్థుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. వృద్ధురాలి వద్ద ఉన్న డబ్బు కోసం హత్య చేశారా లేక ఏదైనా వ్యక్తిగత కారణాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.
- ఇదీ చూడండి:తండ్రి మరణించాడని వైద్య విద్యార్థినిపై దాడి!