నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో దారుణం జరిగింది. ఒంటరిగా నివసిస్తున్న నిరడి నారమ్మ(55) అనే వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆమె తలపై బలంగా కొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో వృద్ధురాలి హత్య - నాగర్ కర్నూల్ జిల్లా తాజా వార్తలు
ఒంటరిగా నివసిస్తున్న ఓ వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో వృద్ధురాలి హత్య
ఉదయాన్నే ఆమె కుటుంబసభ్యులు వచ్చి చూసే సరికి మృతి చెంది ఉండడంతో పోలీసులకు సమాచారం అదించారు. చుట్టు పక్కల ఇళ్లు లేకపోవడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసు విచారణ