యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రంలోని మర్రిగడ్డలో వృద్ధురాలు బోయపల్లి సోమలక్ష్మి(74) మృతి చెందారు. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడి శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఈమెకు కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. సోమలక్షి మరణించడంతో కొడుకు మల్లశ్కు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ రావడం వల్ల హోం ఐసోలేషన్‌లో ఉంచారు. మృతురాలి బంధువులు పీపీఈ కిట్లు ధరించి జేసీబీ సహాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. అడ్డగూడూర్ మండల కేంద్రంలో ఇది మొదటి కరోనా మరణంగా నమోదైంది.
కరోనాతో వృద్ధురాలు మృతి.. జేసీబీతో ఖననం - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రంలో మొదటి కరోనా మరణం నమోదైంది. కొన్ని రోజులుగా కొవిడ్‌తో పోరాడుతున్న వృద్ధురాలు బోయపల్లి సోమలక్ష్మి(74) ఈ రోజు మృతి చెందారు. మృతురాలి బంధువులు పీపీఈ కిట్లు ధరించి జేసీబీ సహాయంతో ఖననం చేశారు.

Corona deaths, addagudur news
ప్రజలు ఇప్పటికైన నిర్లక్ష్యం వదలి లాక్‌డౌన్‌కు సహకరించాలని స్థానిక సర్పంచ్ బాలెంల త్రివేణి దుర్గయ్య, ఎంపీటీసీ పెండల భారతమ్మలు సూచించారు. అవసరం ఉంటేనే తప్ప బయటకు రావద్దన్నారు. ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇదీ చూడండి: పిడుగు పడి ఇద్దరు రైతులు మృతి