Medicines Changed in AP : కడప జిల్లా రాజంపేటలోని ఎర్రబల్లికి చెందిన కె.సుబ్బనరసమ్మ (67) అనే వృద్ధురాలికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో గతేడాది డిసెంబరులో కడపలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యపరీక్షల తర్వాత థైరాయిడ్ సమస్య ఉందని వైద్యులు ధ్రువీకరించారు. వ్యాధి నివారణకుగాను వైద్యుడు మందులు రాసిచ్చారు. సదరు వృద్ధురాలి కుమారుడు సుధాకరాచారి ఆ చీటీతో డిసెంబరు 27న రాజంపేటలోని ఓ మెడికల్ స్టోర్‌కు వెళ్లి మందులు తీసుకొచ్చారు. వాటిని రోజూ వేసుకున్న వృద్ధురాలికి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి మరోసారి వైద్యుడిని కలిశారు.
డాక్టర్ ఒకటి రాసిస్తే.. షాపువాడు మరొకటి ఇచ్చాడు.. చివరకు - రాజంపేటలో ఘోరం, మందులు మార్చి ఇవ్వడంతో మహిళ మృతి
Medicines Changed in AP : మందుల షాపు వ్యక్తి చేసిన తప్పిదానికి ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. డాక్టర్ రాసిన మందులకు బదులు వేరే మందులు ఇవ్వడంతోనే ఘోరం జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వక్తం చేశారు.

Medicines Changed in AP
Medicines Changed in Kadapa : వైద్యుడు యాంటీ థైరాక్సిన్ 10 ఎంజీ రాసిస్తే.. థైరాక్సిన్ సోడియం 100 ఎంజీ మందులు వేసుకోవడం వల్ల ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. గత నెల 24న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు మెడికల్ షాపుపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమెను నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 5న మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.