తెలంగాణ

telangana

ETV Bharat / crime

నీళ్లు అనుకుని యాసిడ్ తాగి వృద్ధురాలు మృతి - తెలంగాణ 2021 వార్తలు

old-woman-died-after-drinking-acid-as-she-felt-water-in-the-hospital-in-nizamabad-district
నీళ్లు అనుకుని యాసిడ్ తాగి వృద్ధురాలు మృతి

By

Published : Jul 23, 2021, 12:47 PM IST

Updated : Jul 23, 2021, 2:16 PM IST

12:44 July 23

ఆస్పత్రిలో నీళ్లు అనుకుని యాసిడ్ తాగి వృద్ధురాలు మృతి

నీళ్లు అనుకుని యాసిడ్ తాగి వృద్ధురాలు మృతి

ఆసుపత్రిలో ఉన్న బంధువును పరామర్శించేందుకు వెళ్లిన ఓ వృద్ధురాలు... మంచినీళ్లనుకొని పొరపాటున యాసిడ్‌ తాగి ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందంటూ మృతదేహంతో బంధువులు ఆందోళనకి దిగారు.  

         నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి పాము కాటుకు గురై ఖలీల్వాడీలోని జయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేల్పూర్ మండలం మోతె గ్రామానికి చెందిన జడల సాయమ్మ బాధితుడికి పెద్దమ్మ వరస అవుతుంది. జయమ్మ అతన్ని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లింది. దాహం వేయగా... అక్కడ ఓ సీసా కనపడింది. అవి మంచినీళ్లనుకొని వెంటనే తాగేసింది.

ఈమెకు ట్రీట్​మెంట్ జరిగి ఏం చనిపోలేదు. నీళ్లనుకొని యాసిడ్ తాగుడు వల్లనే ఈమె చనిపోయింది. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడితే... ఆయనకు తోచింది ఏమన్న చేస్తా అన్నడు. మేమూ సరే అన్నం. పాము కరిచి చికిత్స పొందుతున్న అతనికి ఫ్రీ ట్రీట్​మెంట్ ఇస్తమన్నరు. ఇగ మేమూ బలవంతమేం చేయలే. - మృతురాలి బంధువు

            కానీ అది యాసిడ్ కావడంతో సాయమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సాయమ్మ చనిపోయిందని... ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. చివరకు పాముకాటుతో చికిత్స పొందుతున్న బాధితుడికి ఉచితంగా చికిత్స చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇవ్వడంతో శాంతించారు.

ఇదీ చూడండి:ఎమ్మెల్యేలను నిర్బంధించిన జర్నలిస్టులు- ఎందుకంటే?

Last Updated : Jul 23, 2021, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details