వెచ్చదనం కోసం వేసుకున్న మంటలే ఓ వృద్ధురాలి ప్రాణాలు తీశాయి. ఏపీలోని విజయనగరం జిల్లా వేపాడలో ఈ విషాదం చోటు చేసుకుంది. రోజూలాగే జోగులమ్మ అనే వృద్ధురాలు తన ఇంటి సమీపంలో.. వెచ్చదనం కోసం చలి కుంపటి వెలిగించింది.
చలి మంటల్లో వృద్ధురాలి సజీవ దహనం - telangana news
చలికాలం కదా అని వెచ్చదనం కోసం ఆ వృద్ధురాలు చలిమంట వేసుకుంది. కాని పాపం.. అవే మంటలు అంటకుని సజీవ దహనం అయింది.
![చలి మంటల్లో వృద్ధురాలి సజీవ దహనం old-woman-burned-alive-and-died-in-vizianagaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10406522-82-10406522-1611804472797.jpg)
చలి మంటల్లో వృద్ధురాలి సజీవ దహనం
చలి కాచుకుంటున్న ఆమెకు ప్రమాదవశాత్తు ఒంటికి నిప్పంటుకుంది. మంటలు ఆర్పడానికి చుట్టుపక్కల వారు ప్రయత్నించినప్పటికి ప్రయెజనం లేకపోయింది. మంటల్లోకాలి సజీవదహనం అయింది.
ఇదీ చదవండి:పందిని తప్పించబోయి ప్రమాదం: ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలు