Old Parents Protest: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ డివిజన్ మన్సూరాబాద్ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. కుమారుడు, కోడలు తమను తమ ఇంటి నుంచి వెళ్లగొట్టారని వృద్ధ దంపతులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. చీకటి గదిలో బంధించి హింసించారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా కావేటి కౌసల్యాదేవ, లింగమయ్య అనే వృద్ధ దంపతులు తమను తమ చిన్న కుమారుడు, కోడలు తమను హింసిస్తున్నారని వాపోయారు. వారి వేధింపులు భరించలేక కలెక్టర్‌ను కలిశారు.
దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ ఇంటిని వృద్ధులకు అప్పగించాలని ఆర్టీవో, తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇంటిని ఖాళీ చేయించి 10 తులాల బంగారు ఆభరణాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల పత్రాలు వృద్ధులకు అప్పజెప్పాలని అధికారులకు సూచించారు. దీంతో వృద్దులతో సహా రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఇంటికి తాళం వేసి కొడుకు, కోడలు పరారయ్యారు.
మేమే ఇళ్లు కట్టుకున్నాం. మమ్మల్ని నా కొడుకు, కోడలు నానా బాధలు పెట్టారు. మూడేళ్ల నుంచి ఇది జరుగుతుంది. మేం ఓల్డ్ ఏజ్ రూమ్‌లో ఉంటున్నాం. కలెక్టర్, ఆర్డీవో మాకు సాయం చేసిండ్రు. ఇవాళ మాకు మా ఇల్లు వస్తదనుకున్నాం. కానీ మా కొడుకు, కోడలు ఇద్దరు పారిపోయిండ్రు.
- కావేటి కౌసల్యాదేవి, బాధితురాలు
మా నాన్న, అమ్మ, బ్రదర్ ఒక్కటే చోట ఉండేవారు. మా బ్రదర్ పెద్ద క్రిమినల్. 2006లో ప్రాపర్టీ డివైడ్ చేశాం. ఒపెన్ ప్లేస్ ఉంటే నేను ఇల్లు కట్టుకున్నా. దానిని కూడ అతనికే ఇచ్చా. అయిప్పటికీ తల్లితండ్రులను వేధించాడు. మేం అడిగితే మాపై కేసులు వేసి అసభ్యకరంగా మాట్లాడుతాడు. నేను ఐదేళ్లు ఇబ్బందులు పడ్డా. అందుకే మేం పట్టించుకోలేదు. ఎవరు వచ్చినా అసభ్యకర మాటలే.