తెలంగాణ

telangana

ETV Bharat / crime

RAPE ATTEMPT: ఆడుకుంటున్న చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి వృద్ధుడి అత్యాచారయత్నం!

మనవరాలు వయసున్న బాలికపై అత్యాచారానికి యత్నించాడు(rape attempt) ఓ కామాంధుడు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని దగ్గరకు తీసుకొని... అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

RAPE ATTEMPT, old man rape attempt on minor
చిన్నారిపై వృద్ధుడు అత్యాచారయత్నం, బాలికపై అత్యాచార యత్నం

By

Published : Sep 4, 2021, 6:47 PM IST

మనవరాలు వయసున్న చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు(rape attempt) ఓ కామాంధుడు. చిన్నారిని దగ్గరకు తీసుకొని... అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ప్రయత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

మూసాపేటలో నివసించే గౌస్(65) అనే వృద్ధుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని కూకట్‌పల్లి సీఐ నర్సింగ్ రావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం తన ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి... ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. చిన్నారి ఏడుపులు విన్న తల్లిదండ్రులు... వచ్చి ఆరా తీయగా జరిగిన ఘటన వారికి తెలియజేసిందని వెల్లడించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారని... పోక్సో(pocso act) చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఇదీ చదవండి:RAPE: బెంగళూరులో ఏపీకి చెందిన ఐటీ ఉద్యోగినిపై నైజీరియన్ల అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details