సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చెప్పులు, చేతికర్ర పక్కన పెట్టి ఆ వృద్ధుడు రైలు కోసం ఎదురుచూశాడు. అందరూ చూస్తుండగానే అకస్మాత్తుగా రైలు కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య - ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు
అందరూ రైలు కోసం వేచిచూస్తున్నట్లు ఆ పెద్దాయన కూడా ఎదురు చూశాడు. అందరిలా గమ్యం చేరుకోవడం కోసం కాదు.. పయనాన్ని ఆపేందుకు. జీవితంలో అలసిపోయాడో, ఆరోగ్యంతో చెదిరిపోయాడో తెలియదు కానీ.. ఆ 60 ఏళ్ల వృద్ధుడు మాత్రం ప్రాణాలను తీసేసుకున్నాడు.
రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య
సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుడు ఎక్కడి నుంచి వచ్చాడు.. ఎందుకు చనిపోయాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి:'శ్మశానంలో ఖాళీ లేదు.. 20 గంటల తర్వాత రండి'