తెలంగాణ

telangana

ETV Bharat / crime

Old Couple Suicide బంధువులకు భారం కాకూడదని తనువులు చాలించారు - మల్కాజిగిరి ఠాణా పరిధిలో దంపతుల బలవన్మరణం

Old Couple Suicide జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఒకరిపై ఆధారపడకుండా బతకాలనుకుంటాం. కానీ పరిస్థితులు మన జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. వృద్ధాప్యంలో ఐతే మన పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆదుకునేవారు లేకపోతే ఇక బతకడం ఒక సవాల్ లాంటిది. ఆ పరిస్థితి రాకూదనుకున్నారేమో, ఎవరికీ భారం కాకుండా తనువు చాలించారు ఆ వృద్ధ దంపతులు. ఇ విషాద ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.

Old Couples Suicide
Old Couples Suicide

By

Published : Aug 28, 2022, 11:27 AM IST

Old Couple Suicide ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం వెరిసి ఆ దంపతులను కుంగదీశాయి. సంతానం లేకపోవడంతో ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి వారిని ఆలోచనలో పడేసింది. బంధువులకు తామెందుకు భారం కావాలని భావించిన ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మల్కాజిగిరి ఠాణా సీఐ జగదీశ్వర్‌రావు తెలిపిన ప్రకారం.. కె.సాయిదాసు(65), విజయలక్ష్మి (60) దంపతులు బృందావన్‌ కాలనీలో ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

సాయిదాసు ఓ ప్రైవేటు ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి. తమ బాగోగులు చూసేందుకు సంతానం లేకపోవడంతో బంధువులకు భారం కాకూడదని భావించారు. ఈ విషయాన్ని వివరిస్తూ తెలుగు, ఇంగ్లిష్‌లలో లేఖలు రాసి.. శనివారం ఉరి వేసుకున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details