కామారెడ్డి జిల్లాలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. నస్రుల్లాబాద్ మండలం నిజాంసాగర్ ప్రధాన కాలువ సమీపంలోని కొచ్చరి మైసమ్మ దేవాలయం వద్ద పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిని మహారాష్ట్రకు చెందిన గంగాధర్, మహనందగా గుర్తించారు.
పురుగులమందు తాగి వృద్ధ దంపతుల ఆత్మహత్య - old couple suicide in kamareddy
మహారాష్ట్రకు చెందిన వృద్ధ దంపతులు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని కొచ్చరి మైసమ్మ దేవాలయం వద్ద ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధ దంపతుల ఆత్మహత్య, కామారెడ్డిలో వృద్ధ దంపతుల ఆత్మహత్య
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. సంతానం లేకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
- ఇదీ చదవండి :సైదాబాద్‌లో యువకుడి అనుమానాస్పద మృతి