నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం అవుసలోనిపల్లి గ్రామానికి చెందిన రాఘవేంద్ర భార్య కాన్పు సమయంలో మృతి చెందింది. ఇరు కుటుంబాలు కలిసి.. మృతురాలి చెల్లెలు(16)ను రాఘవేంద్రకు ఇచ్చి వివాహం జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శిశు సంక్షేమ శాఖ అధికారులు సంఘటనాస్థలికి వెళ్లారు.
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
శిశుసంక్షేమ శాఖ అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్న సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలోని అవుసలోనిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాలికను ఉమ్మడి జిల్లా కేంద్రంలో స్టేట్ హోంకు తరలించారు.
బాల్య వివాహం, బాల్య వివాహం అడ్డగింత, నారాయణపేటలో బాల్య వివాహం
వివాహాన్ని ఆపి.. ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం బాలికను ఉమ్మడి జిల్లా కేంద్రంలోని స్టేట్ హోంకు తరలించారు. మైనర్ బాలికలకు వివాహం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
- ఇదీ చూడండి :ఐదు నెలల్లో 216 కోట్ల టీకా డోసులు రెడీ!