రుణాలు ఇప్పిస్తామంటూ చిరు వ్యాపారులను, ఒంటరి మహిళల నుంచి బంగారు ఆభరణాలను కాజేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలో విశాఖపట్నంకు చెందిన మెడిశెట్టి చిట్టి బాబు గత కొన్నిరోజులుగా మెసాలకు పాల్పడుతుండటంతో... అదుపులోకి తీసుకున్నామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన నార్సింగ్ పోలీసులు - Nursing police arrest interstate thief
ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని మెసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు.

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
ఏపీతో పాటు రాష్ట్రంలో మొత్తం 14 కేసులు నిందితుడిపై ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు. చిట్టిబాబు నుంచి పది తులాల బంగారం, ఒక ద్విచక్రవాహనం, ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఇదీ చదవండి:వాగులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి