ఉపాధి హామీ పనులు చేస్తుండగా మూర్చరావడం వల్ల కూలీ మృతి చెందాడు. ఊట్కూరు మండలం నిడుగుర్తిలో ఉపాధి పనులు చేస్తుండగా... గ్రామానికి చెందిన మహేశ్ (30) మూర్చతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మూర్చతో ఉపాధి కూలీ మృతి - తెలంగాణ వార్తలు
పని ప్రదేశంలో మూర్చ వచ్చి ఉపాధి కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండలం నిడుగుర్తిలో జరిగింది.
నారాయణపేట వార్తలు
గ్రామానికి చెందిన మహేశ్ రోజులాగనే ఉపాధి పనికి వెళ్లాడు. పెద్దకాలువలో పని చేస్తుండగా.. బహిర్భూమికి వెళ్తున్నానని తోటి వారికి చెప్పి వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోయేసరికి అనుమానమొచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతుడికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరఫున సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.