తెలంగాణ

telangana

ETV Bharat / crime

cash for vote: మత్తయ్యపై కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ - తెలంగాణ వార్తలు

నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసు(cash for vote) విచారణ ప్రారంభమైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వేం కృష్ణ కీర్తన్, ఉదయ్‌సింహ, సెబాస్టియన్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. ఈడీ కేసు తదుపరి విచారణను ఈనెల 29కి న్యాయస్థానం వాయిదా వేసింది.

cash for vote case, note for vote case inquiry in nampally court
నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసు, ఓటుకు నోటు కేసు 2021

By

Published : Oct 4, 2021, 4:46 PM IST

ఓటుకు నోటు కేసులో(cash for vote) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభియోగపత్రంపై నాంపల్లి కోర్టు విచారణ ప్రక్రియ ప్రారంభించింది. కేసులో నిందితులుగా ఉన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, వేం కృష్ణకీర్తన్, సెబాస్టియన్ నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. ఒక్కొక్కరు రూ.25వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. నాలుగో నిందితుడిగా ఉన్న మత్తయ్య జెరూసలేం విచారణకు హాజరు కాలేదు. సమన్లు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరుకానందున మత్తయ్యపై కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

అనిశా ఛార్జ్‌షీట్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేసిన ఈడీ.. ఇటీవల అభియోగపత్రం సమర్పించింది. ఈడీ కేసు(cash for vote) తదుపరి విచారణను ఈనెల 29కి న్యాయస్థానం వాయిదా వేసింది. అనిశా కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే ఉన్నందున.. విచారణను నవంబరు 1కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:Kokapet Land Issue in assembly: కోకాపేట భూముల వేలంపై సీబీఐ విచారణకు మరోసారి కాంగ్రెస్‌ డిమాండ్‌

ABOUT THE AUTHOR

...view details