తెలంగాణ

telangana

ETV Bharat / crime

crime news: అక్కడ స్నానం వద్దన్నందుకు హత్య - స్నానం విషయంలో గొడవ

స్నానం విషయంలో గొడవ మరొకరిని హత్య చేసే వరకు దారి తీసింది. చేతిపంపు వద్ద స్నానం చేయవద్దన్నందుకు ఓ యాచకుడు మరో యాచకుడిని రోకలిబండతో కొట్టి చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్ చాదర్​ఘాట్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.

crime news
crime news: అక్కడ స్నానం వద్దన్నందుకు హత్య

By

Published : Jun 3, 2021, 10:44 PM IST

చేతిపంపు వద్ద స్నానం చేయవద్దన్నందుకు ఓ యాచకుడిని మరో యాచకుడు చంపేశాడు. నారాయణపేట జిల్లాలోని జలాల్ పూర్​కి చెందిన ముక్తాల పురుషోత్తం రెడ్డి… హైదరాబాద్​ చాదర్​ ఘాట్ సాయిబాబా టెంపుల్ ఫుట్ పాత్​పై ఉంటూ యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. అదే ఫుట్ పాత్​పై నివసించే నేపాల్​కు చెందిన బహదూర్ పబ్లిక్ బోరుపంపు వద్ద స్నానం చేస్తున్నాడు.

గమనించిన పురుషోత్తం రెడ్డి అక్కడ స్నానం చేయవద్దని అతడిని వారించాడు. కోపోద్రిక్తుడైన బహదూర్ రోకలిబండతో పురోషోత్తం రెడ్డి తలపై దాడి చేయగా… అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి:Lockdown effect: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details