తెలంగాణ

telangana

ETV Bharat / crime

గుట్కా విక్రేత అరెస్టు.. రెండు లక్షల విలువైన సరకు స్వాధీనం - Hyderabad latest news

నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఉత్తర మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద రెండు లక్షల విలువైన పొగాకు, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి బోయిన్​పల్లి స్టేషన్​లో అప్పగించారు.

man selling gutka has been arrested by the Northern Zone Task Force police
గుట్కాను విక్రయిస్తున్న వ్యక్తిని ఉత్తర మండల టాస్క్​ఫోర్స్ పోలీసుల అరెస్టు

By

Published : Feb 6, 2021, 6:53 AM IST

నిషేధిత గుట్కాను విక్రయిస్తున్న బోయిన్​పల్లికి చెందిన మంగీలాల్ సోనీ అనే వ్యక్తిని ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పాన్​షాపు, జనరల్ స్టోరుల్లో వాటిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి రెండు లక్షల విలువైన పొగాకు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

రాజస్థాన్ జోధ్​పూర్ ప్రాంత వాసి మంగీలాల్ సోని అనే వ్యక్తి నగరంలోని బోయిన్​ల్లిలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని బీదర్​కు చెందిన కొంతమందితో కలిసి నిషేధిత గుట్కా ప్యాకెట్లు సరఫరా చేసే ఏజెంటుగా మారినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్​ లక్ష్యంగా..

హైదరాబాద్​ను లక్ష్యంగా చేసుకుని పాన్​షాప్​, కిరాణా స్టోర్లలో అవసరమైన వారికి నిషేధిత గుట్కాను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. బోయిన్​పల్లిలో ఓ దుకాణంలో గుట్కా ప్యాకెట్లు, మరికొన్ని మత్తుపదార్థాలు విక్రయిస్తుండగా అతన్ని ఉత్తర మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గతంలోనే ఇతనిపై రెండు కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు నుంచి వివిధ రకాల బ్రాండ్లకు చెందిన పొగాకు ప్యాకెట్​లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి బోయిన్​పల్లి స్టేషన్​ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి:ప్రజాప్రతినిధులకు సమన్లు.. ఎందుకంటే..?

ABOUT THE AUTHOR

...view details