ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో రౌడీ షీటర్ల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించి.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నగర బహిష్కరణ చేస్తామని అధికారులు హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదు. ఆదివారం సాయంత్రం నెహ్రూబజార్ వద్ద రవి అలియాస్ ముక్కురవి అనే రౌడీ షీటర్.. రాజమండ్రికి చెందిన సత్యనారాయణ అలియాస్ బాబులు రెడ్డి అనే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
ఈ క్రమంలోనే రౌడీ షీటర్ ముక్కు రవి.. బాబులుపై దాడి చేశాడు. అనంతరం కర్రతో తలపై బలంగా కొట్టాడు. తీవ్రగాయలతో రోడ్డుపై పడి ఉన్న బాబులును స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.