తెలంగాణ

telangana

ETV Bharat / crime

Nigerian arrested In AP: భీమవరం డ్రగ్స్ కేసులో నైజీరియన్ అరెస్ట్ - తెలంగాణ వార్తలు

Nigerian arrested In AP : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డ్రగ్స్ కేసులో నైజీరియన్ అరెస్ట్ అయ్యాడు. యువకులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న పీటర్ వాజకోనును భీమవరం పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు.

Nigerian arrested In AP, ap drugs case
భీమవరం డ్రగ్స్ కేసులో నైజీరియన్ అరెస్ట్

By

Published : Jan 30, 2022, 1:42 PM IST

Nigerian arrested In AP : ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మత్తు పదార్థాల కేసులో నైజీరియన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇటీవల సంక్రాంతి సెలవులకు బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన విద్యార్థులు.. ఓ లాడ్జిలో మత్తుపదార్థాలు సేవిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. లోతుగా దర్యాప్తు చేసిన అధికారులు.. బెంగళూరులో విద్యార్థులకు మత్తుపదార్థాలు విక్రయిస్తున్న నైజీరియన్ పీటర్ వాజాకో చిన్వూబాను అరెస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details