తెలుగుమాట్రీమోనీలో ఓ యువతిని మోసం చేసిన నైజీరియన్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (HYDERABAD CYBER CRIME POLICE) అరెస్ట్ చేశారు. బేగంపేటకు చెందిన ఓ యువతి తెలుగు మ్యాట్రిమోనీలో (TELUGU MATRIMONY) ప్రొఫైల్ పెట్టారు.
ఓషర్ ఎబుక విక్టర్ అనే నైజీరియన్ (NIGERIAN) తెలుగు మ్యాట్రిమోనీలో యువతి ప్రొఫైల్ (PROFILE) చూసి నచ్చిందని వల వేశాడు. అమెరికాలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. మాటలు కలిపాడు. భారత్ రావడానికి వీసా (BHARAT VISA) కోసం గుజరాత్‌లో (GUJARATH) ఇల్లు కొన్నానని నమ్మించాడు. ఇంటి మరమ్మతు కోసం పలు దఫాలుగా రూ.10 లక్షలు అకౌంట్‌లో జమ చేయించుకున్నాడు.