Newly Wed Woman Suicide : ఇష్టం లేని పెళ్లి చేశారనే మనస్తాపంతో నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ కేపీహెచ్‌బీకాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన తులసి జ్యోత్స్న భర్త గతంలోనే చనిపోయారు. కుట్టు పని చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన జితేంద్రిత (26)కు పెళ్లి అంటే మొదటి నుంచి ఇష్టం లేదు. దీంతో గతంలోనే చిన్న కుమార్తెకు పెళ్లి చేశారు.
ఇష్టం లేని పెళ్లి.. నెలరోజులకే నవవధువు ఆత్మహత్య
Newly Wed Woman Suicide : తండ్రిని కోల్పోయిన ఇద్దరు ఆడపిల్లలకు అమ్మానాన్నా అన్నీ తల్లే అయి పెంచి పెద్ద చేసింది. చిన్నప్పటి నుంచి తల్లి కష్టం చూసిన ఆ యువతికి పెళ్లి చేసుకుని తల్లిని వదిలి వెళ్లడం ఇష్టం లేదు. ఈ సంగతే తల్లికి చెప్పగా.. ఆమె ముందు తన చిన్న కుమార్తెకు వివాహం జరిపించింది. 'ఎన్నాళ్లు ఒంటరిగా ఉంటావు.. నేను చనిపోతే నీకంటూ ఓ తోడు ఉండాలిగా' అని పెద్దకూతురికి నచ్చజెప్పి పెళ్లి చేసింది ఆ తల్లి. కానీ పెళ్లంటే ఇష్టం లేని ఆ యువతి వివాహం జరిగిన నెలరోజులకే ఆత్మహత్య చేసుకుంది.
Newly Wed Woman Suicide in KPHB Colony : ఈ క్రమంలో మార్చి 27న వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంతోశ్‌తో జితేంద్రిత వివాహం జరిపించారు. నూతన దంపతులు పది రోజుల క్రితం కేపీహెచ్‌బీకాలనీ పరిధి ధర్మారెడ్డి కాలనీలోని హెచ్‌ఐజీ 14 అద్దెంట్లో కాపురం పెట్టారు. భర్త సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్లారు. జితేంద్రిత ఇంటి నుంచే (వర్క్ ఫ్రం హోం) విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకుని రాత్రి 10 గంటలకు భర్త ఇంటికి వచ్చాడు. ఎంతకు తలుపు తీయకపోవడంతో ఇరుగు పొరుగు సాయంతో తలుపులు పగలకొట్టారు. అయితే అప్పటికే జితేంద్రిత ఉరేసుకుని చనిపోయారు. ఇష్టం లేని వివాహమే ఆత్మహత్యకు కారణమని కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి :