Newly married couple suicide attempt: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పరిధి రజక కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నవ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. గత 15 రోజుల క్రితం వినాయక చవితి పండగ రోజున ఇరు కుటుంబాల అంగీకారంతో ఆలయంలో వరుడు తాడువాయి వినయ్(19), చంపాలా అఖిల (17) ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ కలహాల మధ్య ఆత్మహత్యకు ప్రయత్నించారు.
పెళ్లైన 15 రోజులకే నవజంట ఆత్మహత్యాయత్నం.. వధువు మృతి - తెలంగాణ క్రైమ్ న్యూస్
Newly married couple suicide attempt: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో నవ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా భర్త గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Newly married couple suicide attempt
ఈ ఘటనలో వధువు మృతి చెందగా.. వరుడు వినయ్ పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వధువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: