నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై కారు, ద్విచక్రవాహనం ఢీకొని యువ దంపతులు మృతి చెందారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్కు చెందిన దంపతులు మంతటి సూర్య శేఖర్(25), పల్లవి(22) హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం బంధువుల ఇంట్లో జరిగిన వేడుకలకు వచ్చి ఆదివారం తిరిగి హైదరాబాద్కు ద్విచక్ర వాహనంపై ప్రయాణమయ్యారు.
రోడ్డు ప్రమాదంలో యువ దంపతులు మృత్యువాత - బైక్ను ఢీకొట్టిన కారు ప్రమాదంలో దంపతులు మృతి
రోడ్డు ప్రమాదం యువ దంపతులను బలి తీసుకుంది. బంధువుల ఇంట్లో వేడుకకు హాజరై తిరిగివస్తుండగా కారు రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. పెళ్లి జరిగి ఏడాదీ గడవకముందే దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
రోడ్డు ప్రమాదంలో యువ దంపతులు మృత్యువాత
బ్రాహ్మణపల్లి సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో యువ దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వివాహం జరిగి ఏడాదీ తిరగకముందే దంపతుల మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రి వద్ద బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:'ఈ నెల 10లోపు ధరణిలో చేరిన రైతులకు నగదు జమ'