Newly married couple died due to electric shock: హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. బాత్రూమ్‌లో గీజర్ పేలి నవదంపతులు దుర్మరణం చెందారు. పోలీసులు కథనం ప్రకారం స్థానిక ఖాదర్‌బాగ్‌కు చెందిన వైద్యుడు సయ్యద్ నిసారుద్దీన్ వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య సైమా ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. ఇవాళ ఇద్దరూ తమ నివాసంలోనే గీజర్ పేలడంతో కరెంట్ షాక్‌తో అపస్మారక స్థితికి చేరుకున్నారు.
కుటుంబ సభ్యులు వారి ఇరువురికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందన లేకపోయే సరికి అనుమానం వచ్చి.. ఇంటికి చేరుకుని చూడగా వారిద్దరు విగత జీవులుగా కనిపించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.