New married couple face accident: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో నవ జంటకు పెను ప్రమాదం తప్పింది. మచిలీపట్నానికి చెందిన ఆదిత్య, కాకినాడకు చెందిన శ్రావణితో గురువారం రాత్రి వివాహమైంది. పెళ్లి తర్వాత కాకినాడ నుంచి మచిలీపట్నానికి వెళ్తుండగా గుడ్లవల్లేరు మండలం కౌతవరం వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలోకి వెళ్లి బోల్తా పడింది.
Newly married couple accident : కారు బోల్తా.. కొత్త జంటకు తప్పిన పెను ప్రమాదం - telangana latest updates
Newly married couple accident : పెళ్లి చేసుకుని కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోన్న ఓ జంటకు పెను ప్రమాదం తప్పింది. వివాహం అనంతరం కాకినాడ నుంచి మచీలీపట్నం వెళ్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
కారు బోల్తా.. కొత్త జంటకు తప్పిన పెను ప్రమాదం
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నవ వధూవరులతో పాటు కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: Kurnool Road Accidents : వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి