మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూరుగుపాడు వద్ద ముళ్లపొదల్లో నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. అప్పుడే పుట్టిన ఆడ శిశువును సంచిలో పెట్టి పరారయ్యారు. గుర్తించిన స్థానికులు.. అంగన్‌వాడీ కార్యకర్తలకు సమాచారం అందించారు. శిశువును ఆశా కార్యకర్తలు డోర్నకల్ ఆస్పత్రికి తరలించారు.
ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువు - Newborn female child in Thorn bushes
మహిళా దినోత్సవం రోజు మహబూబాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బూరుగుపాడు వద్ద ముళ్ల పొదల్లో ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. గమనించిన స్థానికులు అంగన్‌వాడీ కార్యకర్తలకు సమాచారం అందించారు.

ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువు