కరోనా రెండో దశ ఎన్నో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగుల్చుతోంది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం యానంపేటకు చెందిన రాజేశ్(29) వివాహమైన మూడు నెలలకే బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందాడు. పెళ్లయిన నెల రోజులకే కొవిడ్ మహమ్మారి బారిన పడి క్షేమంగా బయటపడ్డ రాజేశ్‌ను.. ఫంగస్ రూపంలో మృత్యువు కబళించింది.
బ్లాక్ ఫంగస్‌తో నూతన వరుడు మృతి - black fungus cases updates in telangana
మూడు నెలల క్రితమే పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నాడో వ్యక్తి. నెల రోజులకే కరోనా బారిన పడి చికిత్స పొంది వైరస్‌ను జయించాడు. అంతా బాగుందనుకునేలోపే బ్లాక్ ఫంగస్ రూపంలో మరో వైరస్ అతడిపై దాడి చేసింది. అప్పటికే అలసిపోయిన ఆ నూతన వరుడు.. పోరాడలేక ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలో ఇది జరిగింది.
died with black fungus
మూడు నెలల క్రితమే పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్న రాజేశ్‌కు ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. వైద్య చికిత్సల కోసం రూ. 27 లక్షలు ఖర్చు చేసినా.. ప్రాణం దక్కలేదంటూ ఆ ఇరు కుటుంబ సభ్యులు రోదించిన తీరు స్థానికులను కన్నీళ్లు పెట్టించింది.
ఇదీ చదవండి:కన్నతల్లి కర్కషత్వం.. కుమారున్ని కొట్టి చంపిన వైనం