తెలంగాణ

telangana

ETV Bharat / crime

Shilpa Chowdary Case: కస్టడీలో కీలక విషయాలు.. శిల్పా కేసులో కొత్త క్యారెక్టర్​..!

Shilpa Chowdary Case: పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరి పోలీసు కస్టడీ ముగిసింది. రెండు రోజుల కస్టడీ అనంతరం శిల్పాచౌదరిని పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. కస్టడీలో కీలక విషయాలను పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం.

new character in Shilpa Chowdary Case
new character in Shilpa Chowdary Case

By

Published : Dec 4, 2021, 8:41 PM IST

Shilpa Chowdary Case: అధిక వడ్డీల పేరుతో కోట్ల రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వని కేసులో నిందితురాలైన శిల్పాచౌదరి పోలీసు కస్టడీ ముగిసింది. రెండు రోజుల కస్టడీ అనంతరం శిల్పాచౌదరిని పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం తిరిగి చంచల్​గూడ జైలుకు తరలించారు. మరోవైపు.. గండిపేట సిగ్నేచర్ విల్లాలోని శిల్ప ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శిల్ప ఇంట్లో పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కస్టడీలో శిల్పా చౌదరి నుంచి పలు విషయాలను పోలీసులు సేకరించారు.

రెండు రోజుల కస్టడీలో..

పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన మహిళ.. శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు రెండు రోజుల కస్టడీ తీసుకున్నారు. పోలీసులు 7 రోజుల కస్టడీ అడగ్గా.. కోర్టు రెండు రోజుల అనుమతి ఇచ్చింది. చంచల్​గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శిల్పకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నార్సింగి ఠాణాకు తీసుకెళ్లారు. శిల్ప ఎవరెవరి వద్ద నుంచి ఎంత సొమ్ము తీసుకుందనే ప్రశ్నించారు. డబ్బులు ఎక్కడకు మళ్లించారు.. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపైనా పోలీసులు లోతుగా ఆరా తీశారు.

ఈ కొత్త క్యారెక్టర్​ ఎవరు..?

శిల్పా చౌదరిని మొదటి రోజు ఆరు గంటల పాటు పోలీసులు విచారించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించిన పోలీసులు.. ఆమె బినామీలు, బ్యాంకు ఖాతాలపై లోతుగా ఆరా తీశారు. ఇప్పటి వరకు నమోదైన ఫిర్యాదులపై శిల్ప వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. రెండో రోజు విచారణలో.. కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించిందనే కోణంలో పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. బాధితుల దగ్గర తీసుకున్న డబ్బును రాధిక అనే మహిళకు పెట్టుబడిగా ఇచ్చినట్లు శిల్ప వెల్లడించింది. స్థిరాస్తి వ్యాపారంలో భాగంగా రాధికకు డబ్బులు ఇచ్చినట్లు తెలిపింది. సదరు రాధిక తనకు తిరిగి చెల్లించలేదని శిల్పా చౌదరి పోలీసులకు తెలిపింది. శిల్ప పేర్కొన్న రాధికను పోలీసులు ప్రశ్నించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

శిల్పా మాయల్లో కొత్త కోణం..

Shilpa Chowdary Cheating Case : శిల్పాచౌదరి మాయలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి వరకు అధిక వడ్డీల ఆశచూపి మహిళల నుంచి కోట్లు కొల్లగొట్టిన శిల్పాచౌదరి కేసులో మరో కోణాన్ని పోలీసులు తెలుసుకున్నారు. దివానోస్‌ పేరుతో జూదశాలను నిర్వహించిందని సాక్ష్యాధారాలు సేకరించారు. ఇందులో 90 మంది సెలబ్రిటీల కుటుంబాల మహిళలున్నారని గుర్తించారు. శిల్పా చౌదరి జైల్లో ఉందని తెలుసుకున్న ఆమె బాధితులు తమ వద్ద కూడా రూ.కోట్లలో నగదు తీసుకుని మోసం చేశారంటూ ఒక్కొక్కరూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి...

ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు..

Shilpa Chaudhary case: అధిక వడ్డీలు, వ్యాపారాల్లో లాభాల పేరిట వల వేసి.. ఆసక్తి చూపించిన వారి నుంచి కోట్లలో డబ్బులు రాబట్టిన శిల్పాచౌదరి బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. కోటీ ఐదు లక్షలు మోసం చేసిందని దివ్య అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బయటపడిన శిల్పాచౌదరి మోసాల చిట్టా.. రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే శిల్పపై మూడు కేసులు నమోదుకాగా.. ఇప్పుడు ఇంకొకరు ఫిర్యాదు చేశారు. తన వద్ద రెండు కోట్ల తొంభై లక్షలు తీసుకుని మోసం చేసిందని మరో మహిళ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిట్టీ పార్టీల పేరిట శిల్ప తనకు పరిచయమైందని.. అధిక వడ్డీల ఆశ చూసి 2.9 కోట్ల రూపాయలు తీసుకుందని బాధితురాలు పేర్కొంది. శిల్పపై కేవలం నార్సింగి పోలీస్​స్టేషన్​లోనే ఇప్పటికి మూడు కేసులు నమోదు కాగా.. ఇది నాలుగోది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

హీరో మహేశ్​బాబు సోదరి కూడా బాధితురాలే..

Shilpa Chowdary Case News : శిల్పాచౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్‌ ప్రసాద్‌ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడన్న సమాచారంతో ఎక్కడెక్కడ భూములు కొన్నారన్న వివరాలను సేకరిస్తున్నారు. హీరో మహేశ్‌బాబు సోదరి ప్రియదర్శిని తన వద్ద నుంచి రూ.2 కోట్లకు పైగా నగదు తీసుకుని శిల్పాచౌదరి మోసం చేసిందంటూ కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని నార్సింగి పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అసలు బుట్టలో ఎలా వేసుకునేదంటే..

Shilpa fraud: మోసం చేయడమే ఆమె లక్ష్యం. భార్య చేసే మోసాలకు వత్తాసు పలకడమే భర్త లక్షణం. అధిక వడ్డీలు, వ్యాపారాల్లో లాభాల పేరిట వల వేసి.. వారి నుంచి కోట్లలో డబ్బులు తీసుకుని.. విలాసవంతమైన జీవితాన్ని గడపడమే ఆ దంపతుల ధ్యేయం. అలా మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరి గుట్టు ఎట్టకేలకు బయటపడింది. హైదరాబాద్​కు చెందిన వ్యాపారవేత్త శిల్పను, ఆమె భర్త శ్రీనివాస్​ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details