తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రేమించినోడిని పెళ్లాడేందుకు పోరాటమే చేసింది.. మనువైన మరు నెలకే..

ప్రేమించినోడిని పెళ్లి చేసుకునేందుకు పెద్దలతో పోరాటమే చేసింది. ఓపికతో.. అందరినీ ఒప్పించింది. అందరి సమక్షంలోనే మనసైనోడిని మనువాడింది. ఇష్టపడినోడిని పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుందని ఎన్నో కలలు కన్నది. కానీ.. ఆ కలలు రెండు నెలలు కూడా గడవక ముందే ఆవిరయ్యాయి. పెళ్లి కోసం చేసిన అమ్మాయి.. సంసార జీవింతంలో వచ్చే ఒడిదొడుకులతో పోరాడలేకపోయింది. మనసు ముక్కలై.. ఓ బలహీనక్షణంలో బలవన్మరణం చెందింది.

new bride groom suicided after 2 months of marriage at nandhya thanda
new bride groom suicided after 2 months of marriage at nandhya thanda

By

Published : Oct 14, 2021, 9:52 PM IST

ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పారిపోవటం లాంటి పనులు చేయలేదు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటేనే జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మారు. ఇరువైపులా పెద్దలను కష్టపడి పెళ్లికి ఒప్పించారు. అందరు బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇక వారి ప్రేమకథ సుఖాంతమైంది.. వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని అందరూ భావించారు. కానీ.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. రెండు నెలలు తిరగకముందే ఆ నవ వధువు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ విషాదకర ఘటన.. ఖమ్మం మండలంలో గుదిమళ్ల పరిధిలోని నంద్యా తండాలో జరిగింది.

పెళ్లైన కొద్ది రోజులకే..

నంద్యా తండాకు చెందిన ధరావత్ శైలజ, అదే గ్రామానికి చెందిన యువకుడు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి పెద్దలతో పోరాటం చేశారు. ఇరువైపులా పెద్దలను ఒప్పించి ఆగస్టులో పెళ్లిచేసుకున్నారు. వాళ్లు అనుకున్నది సాధించారు. చివరికి ఒక్కటయ్యారు. ఇక జీవితమంతా ప్రేమానురాగాలతో చిలకాగోరింకల్లా ఉండొచ్చని ఆ అమ్మాయి ఎన్నో కలలు కన్నది. కానీ.. పెళ్లి జరిగిన కొన్ని రోజులకే వారి మధ్య మెల్లగా అభిప్రాయ భేదాలు వచ్చాయి. వాటితో చిన్నచిన్న గొడవలూ ప్రారంభమయ్యాయి. ఎన్నో ఆశలతో ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న శైలజకు.. కోరుకున్న జీవితం లేకపోగా గొడవలు తలెత్తుతున్నాయని తరచూ బాధపడేది. సున్నితమనస్కురాలైన శైలజ.. ఇద్దరి మధ్య జరుగుతున్న ఘర్షణలతో తీవ్ర మనస్థాపం చెందింది. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి గొడవపడుతుంటే తట్టుకోలేక.. ఆ ప్రాణాలే తీసుకోవాలని నిర్ణయించుకుంది.

అందరూ గాఢ నిద్రలో ఉండగా..

పండుగకు అమ్మగారి ఇంటికి వచ్చిన శైలజ.. బుధవారం రోజున రాత్రి ఆత్మహత్యకు పూనకుంది. ఇంట్లో అందరూ గాఢ నిద్రలోనే ఉండగా.. ఎలాంటి అలికిడి చేయకుండా.. ఫ్యాన్​కు ఉరేసుకుంది. కొంత సమయానికి మెలుకువ వచ్చిన తల్లిదండ్రులు ఫ్యాన్​కు వేలాడుతున్న శైలజను చూశారు. తన బిడ్డను రక్షించుకునేందుకు అన్ని రకాలు ప్రయత్నాలు చేశారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. శైలజ అప్పటికే ప్రాణాలు విడిచింది.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details