నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువును డంపింగ్ యార్డ్‌లో వదిలి వెళ్లారు. అటుగా వెళ్తున్న స్థానికులు శిశువు ఏడుపులు విని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పసికందును రక్షించి ఆస్పత్రికి తరలించారు.
డంపింగ్ యార్డులో అప్పుడే పుట్టిన పసికందు.. అసలేమైంది.. - తెలంగాణ నేర వార్తలు
నాగర్‌కర్నూల్‌లో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును చెత్తకుప్పలో వదిలివెళ్లారు. నవజాత శిశువును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శిశువును నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
baby in dumping yard
పసికందును సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆడశిశువనే వదిలేసి వెళ్లారా..? మరే ఇతర కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకుని శిశువును రక్షించిన పట్టణానికి చెందిన ఎస్సై విజయ్‌కుమార్‌ను పలువురు ప్రశంసించారు.