రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ న్యూ అర్బన్ కాలనీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లారు. శిశువు మృతి చెందినట్టుగా స్థానికులు గుర్తించారు. శిశువు కుడి చేతిని పందులు తిన్నాయి.
చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం - వేములవాడ న్యూ అర్బన్ కాలనీలో శిశువు మృతదేహం
అప్పుడే పుట్టిన శిశువును పడేసిన ఘటన... రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ న్యూ అర్బన్ కాలనీలో చోటుచేసుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన కాలనీవాసులు, మహిళలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం
ఈ ఘటనను చూసి కాలనీవాసులు, మహిళలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పుడే పుట్టిన శిశువు పారేసిన ఘటన... పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి:3 నెలల్లో మీ డబ్బు 4రెట్లు అవుతుంది.. చైనీయుల కొత్త మోసం