మేడ్చల్ జిల్లా మల్లాపూర్‌లో ఆరుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 21 తులాల బంగారం, 50 తులాల వెండి, ఐఫోన్, ల్యాప్‌టాప్, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నేపాల్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సీసీఎస్, మల్కాజిగిరి, నాచారం పోలీసులను డీసీపీ రక్షితమూర్తి అభినందించారు. నాచారంలో పీఎస్‌లో కేసులు నమోదైనట్లు ఆమె తెలిపారు.
చోరీలకు పాల్పడుతున్న నేపాల్ ముఠా అరెస్ట్ - నేపాల్ ముఠాను అరెస్ట్
మేడ్చల్ జిల్లా మల్లాపూర్‌లో పలు దొంగతనాలకు పాల్పడుతున్న నేపాల్‌కు చెందిన ఆరుగురు సభ్యుల ముఠాను సీసీఎస్, మల్కాజిగిరి, నాచారం పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 21 తులాల బంగారం, 50 తులాల వెండి, ఐఫోన్, ల్యాప్‌టాప్, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ రక్షిత మూర్తి వెల్లడించారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ వెల్లడించారు. మల్లాపూర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న అమర్ బహదూర్ అనే వ్యక్తిని సోదాలు చేయగా బంగారు హారం దొరికింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా పలు దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు డీసీపీ తెలిపారు. నేపాల్ వాసులైన అమర్ బహదూర్, లిల్ బహదూర్, రామ్ బహదూర్, అశోక్ కరణ్ సింగ్, విశ్వ కర్మ సాగర్, జాన్వీ అనే మహిళను నిన్న రాత్రి ఏడుగంటల ప్రాంతంలో మల్లాపూర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.