Car Accident at Narampeta : రోడ్డుప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ముగ్గురిని పోలీసులు కాపాడారు. నిమిషాల వ్యవధిలోనే స్పందించి ప్రాణాలు పోశారు. నెల్లూరు జిల్లా నారంపేట వద్ద.. జాతీయ రహదారిపై కడప నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారును.. లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. లారీ అడ్డంగా పడి పోయింది.
Car Accident at Narampeta : ముగ్గురి ప్రాణాలను కాపాడిన పోలీసులు - Police Rescued Three Members in Nellore
Car Accident at Narampeta : కారులో వెళ్తున్న ఓ కుటుంబాన్ని ఎదురుగా వస్తోన్న లారీ ఢీకొట్టింది. ఒక్క క్షణంలో అప్పటిదాకా నవ్వుతూ ఉన్న ఆ కుటుంబం రక్తపు మడుగుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంబులెన్స్‌కు కాల్ చేశారు. కానీ అది రావడానికి సమయం పడుతోంది. ఒక్క క్షణంలో ప్రాణం పోవచ్చు.. అదే క్షణంలో ప్రాణం కాపాడవచ్చు అనే విషయం తెలిసిన ఆ ఖాకీలు.. ఒక్క సెకన్ కూడా వృథా చేయకుండా వారి వాహనాల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి ప్రాణాలను కాపాడారు.
Police Rescued Three Members in Nellore : ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ వేణుగోపాల్ రెడ్డి సహా ఇతర సిబ్బంది నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 వాహనం వచ్చే వరకు వేచి చూడకుండా.. పోలీసు వాహనాల్లోనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేవలం 3 నిమిషాల్లోనే ముగ్గురిని వైద్యశాలకు తరలించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. కారులో ఇరుక్కున్న ఓ వ్యక్తిని జేసీబీల సాయంతో కాపాడి ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సేవలను స్థానికులు అభినందించారు.