తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆంధ్రాకు తరలిస్తున్న అక్రమ రేషన్ బియ్యం పట్టివేత - Khammam District Latest News

అక్రమ రేషన్ బియ్యం ఆంధ్రాకు తరలిస్తుండగా టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. లారీ, బొలెరో, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Breaking News

By

Published : Feb 19, 2021, 9:04 PM IST

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం సమీపంలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వచేసి ఆంధ్రాకు తరలిస్తుండగా టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 200 క్వింటాళ్ల బియ్యం, లారీ, బొలెరో, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

పాడుపడిన క్వారీ గదుల్లో నిల్వచేసి బియ్యాన్ని అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తున్నారు. గ్రామానికి దూరంగా ఉండటంతో ప్రజలు గమనించరని ఈ విధంగా రవాణా చేస్తున్నారు.

అక్రమార్కులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో టాస్క్​ఫోర్స్ ఏసీపీ కృష్ణ, నేలకొండపల్లి ఎస్సై అశోక్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మనం తినే ఆహారం ఎంతవరకు సురక్షితం..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details