తెలంగాణ

telangana

ETV Bharat / crime

వాషింగ్‌ మిషన్‌ వృథా నీటి వివాదం.. రాళ్లతో కొట్టి చంపేశారు..! - సత్యసాయి జిల్లా తాజా నేర వార్తలు

Neighbors Killed a Woman in Satya Sai district : ఆంధ్రప్రదేశ్​లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో దారుణం చోటు చేసుకుంది. వాషింగ్‌ మెషిన్‌ నుంచి వెళుతున్న వృథా నీటి విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ ఘటనపై కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

washing machine
washing machine

By

Published : Dec 6, 2022, 2:00 PM IST

Neighbors Killed a Woman in Satya Sai district : ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఓ మహిళపై విచక్షణా రహితంగా దాడి చేశారు. వాషింగ్‌ మెషిన్‌ నుంచి వెళుతున్న వృథా నీటి విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఆ మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కదిరి పట్టణంలోని మశానంపేటలో పద్మావతి అనే మహిళ నివాసముంటున్నారు. ఆమె ఇంట్లోని వాషింగ్‌ మెషిన్‌ నుంచి వచ్చే వృథా నీరు పక్కనే ఉన్న వేమన్న నాయక్‌ ఇంటి ముందుకు వెళ్లింది.

మృతురాలు పద్మావతి

ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వేమన్న నాయక్‌ కుటుంబసభ్యులు పద్మావతిపై బండరాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమె ముఖం, తలపై తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితురాలిని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పద్మావతి మృతిచెందారు. ఈ ఘటనపై కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details