Rape Attempt on Girl : హైదరాబాద్ అంబర్పేట్ పటేల్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై పక్కింట్లో ఉండే జయంత్ చారి(40) కన్నేశాడు. అదనుచూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడాలనుకున్నాడు. దాని కోసం ప్లాన్ వేశాడు. ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూశాడు. పుస్తకాలు ఇస్తానని ఆమెను తన ఇంటికి పిలిచాడు.
పుస్తకాలు ఇస్తానని పిలిచి బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారయత్నం - rape attempt on minor girl at ambarpet
Rape Attempt on Girl : పుస్తకాలు ఇస్తానని నమ్మబలికి ఓ విద్యార్థినిపై పక్కింటి వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని పటేల్‌నగర్‌లో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Rape Attempt on Girl
ఇంట్లోకి రాగానే బాలికపై అత్యాచారయత్నం చేశాడు. అతడి చేష్టలకు భయపడ్డ బాలిక గట్టిగా అరుస్తూ బయటకు పరుగు తీసింది. తన తల్లిదండ్రులున్న చోటుకు వెళ్లి విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అంబర్పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు.
Last Updated : Aug 2, 2022, 10:42 AM IST