తెలంగాణ

telangana

ETV Bharat / crime

Missing young woman: యువతి ఆచూకీ కోసం రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు - వాగు ఉద్ధృతికి యువతుల గల్లంతు

యాదాద్రి భువనగిరి జిల్లా కుర్రారం గ్రామ శివారులోని దోసల వాగులో గల్లంతైన(Missing young woman) యువతి ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్(NDRF) బృందాలు రంగంలోకి దిగాయి. వాగు ఉద్ధృతికి సోమవారం ఇద్దరు యువతులు కొట్టుకుపోగా... ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో యువతి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Missing young woman, ndrf searching for missing young woman
యువతి ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, వాగులో యువతి గల్లంతు

By

Published : Aug 31, 2021, 9:39 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కుర్రారం గ్రామ శివారులోని దోసల వాగులో గల్లంతైన(Missing young woman) హిమబిందు(23) ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్(NDRF) బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. వరద ఉద్ధృతికి సోమవారం ఇద్దరు యువతులు కొట్టుకుపోయారు. సోమవారం సాయంత్రం పారుపల్లి వాగు శివారులో సింధూజ (26) మృతదేహం లభ్యమైంది. మరో యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఏం జరిగింది?

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కుర్రారం వద్ద.... వాగులో పడి ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. యాదగిరిగుట్ట నుంచి రాజపేట మండలం బొందుగులకు గ్రామంలో ఓ ఫంక్షన్​కు ఓ యువకుడు, ఇద్దరు యువతులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా దోసలవాగు ఉద్ధృతిలో బైక్ మీది నుంచి పడిపోయారు. ముగ్గురు చేతులు పట్టుకొని నెమ్మదిగా నడుస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నంచేశారు. కానీ నీటి ఉద్ధృతికి సింధూజ(26), హిమబిందు(23) కొట్టుకుపోయారు. యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. గల్లంతైన వారిలో సింధూజ మృతదేహం లభించగా.. బిందు కోసం గాలిస్తున్నారు. మృతురాలు జనగామ జిల్లా చిన్నకోడూరు వాసిగా గుర్తించారు.

ఇద్దరు యువతులు, ఓ అబ్బాయి బండిపై వస్తున్నారు. వాగు మధ్యలోకి వచ్చేసరికి బండి ఆగిపోయింది. వాగు ప్రవాహానికి కింద పడిపోయారు. అబ్బాయి ఒకవైపు, అమ్మాయిలో మరోవైపు పడిపోయారు. బండి కొట్టుకుపోయింది. పడిపోయినవారంతా ఎలాగోలా పైకి లేచారు. ముగ్గురు ఒకరికొకరు చేతులు పట్టుకుని కొంతదూరం వచ్చారు. ఇంతలో ఓ అమ్మాయి కాలు జారిపోయింది. కిందపడిపోయిన ఆమె... మరో అమ్మాయి కాలు పట్టుకుంది. ఇద్దరు చూస్తుండగానే కొట్టుకుపోయారు.

- స్థానికుడు

ఇదీ చదవండి:Two girls missing: వాగులో ఇద్దరు యువతుల గల్లంతు... ఓ మృతదేహం లభ్యం

ABOUT THE AUTHOR

...view details